Crime News: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సక్రమైన మార్గంలో పెట్టాల్సిన గురువే పక్కదారి పట్టాడు. కూతుర్లలాగా చూసుకోవాల్సిన విద్యార్థినులతో చెడుగా ప్రవర్తించాడు. క్లాసులో అమ్మాయిల ముందే శృంగార పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన క్రిష్ణదాస్ అనే వ్యక్తి ఇరానియల్ ఏరియాలోని హైయర్ సెకండరీ స్కూల్‌లో అకౌంట్స్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ స్కూల్‌లో 1 నుంచి 12 తరగతుల వరకు మొత్తం 1500దాకా విద్యార్థినీ, విద్యార్థులు చదువుకుంటున్నారు. క్రిష్ణదాస్ 11,12 తరగతులకు అకౌంట్స్ పాఠాలు చెబుతున్నాడు. క్రిష్ణదాస్‌కు ఏమైందో ఏమో తెలియదు కానీ, అకౌంట్స్ క్లాస్‌కు బదులు విద్యార్థులకు శృంగార పాఠాలు చెప్పటం మొదలుపెట్టాడు.
అమ్మాయిల ముందే బూతు పాఠాలు చెప్పేవాడు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది అమ్మాయిలు దీనిపై నేరుగా కులాచల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. అయితే, పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రిన్సిపల్ రూమ్ వద్ద నిరసనకు దిగారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు ఆదేశించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : విద్యార్థినిపై క్లాస్ టీచర్ అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు!