మీ అందరికీ పెదరాయుడు సినిమా గుర్తుంది కదా? రాయుడు ఒక్కసారి తీర్పు ఇస్తే.. ఇక దానికి తిరుగు ఉండదు. ఊరి జనాభా అంతా ఆ తీర్పుని తప్పక పాటించాలి. ఒకప్పుడు మన పల్లెల్లో ఇలాంటి రచ్చబండ తీర్పులు ఉండేవి. కానీ.., ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశంలో ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ.., తమిళనాడులోని ఓ జిల్లాలో మాత్రం ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ లేదు. ఒకవేళ అక్కడక్కడ ఉన్నా.., 427 గ్రామాలకు చెందిన ప్రజలు రక్షణ కోసం, న్యాయం కోసం పోలీసులు, కోర్టులను ఆశ్రయించరు. ఆ 427 గ్రామాలకు ఓ పెద్ద ఉన్నాడు. ఆయనే అక్కడిక్కడ తీర్పు ఇచ్చేస్తాడు. శిక్షలు విదించేస్తాడు. 427 గ్రామాలకు పెద్ద దిక్కు అనగానే ఆ వ్యక్తి ఎంత పెద్దోడు అయి ఉంటాడని ఆలోచిస్తున్నారా? అంత సీన్ లేదు. ఇన్ని గ్రామాలకి తీర్పు ఇచ్చేది కేవలం 9 సంవత్సరాల వయసుండే ఓ బుడ్డోడు. పేరు శక్తి వేల్. ప్రస్తుతం అతని ఐదవ తరగతి చదువుతున్నాడు.
తమిళనాడులోని తిరువన్నమల్లై జిల్లాలో ఉండే కొండ ప్రాంతానికి ఆనుకుని ఈ 427 గ్రామాలు ఉన్నాయి. వీరికి పోలీసులు, కోర్టులు, ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం ఉండదు. వీరంతా నమ్మేది కేవలం ఈ 9 ఏళ్ళ వయసున్న శక్తి వేల్ కుటుంబాన్నే. ఆ వంశంలో ఎవరైనా రచ్చబండ దగ్గర తీర్పు ఇస్తే.., ఇక ఎంతటి వారైనా దానికి కట్టుబడాల్సిందే. లేకుంటే వారిని ఊరి నుండి వెలేస్తారు. శక్తి వేల్ తాతయ్య నిన్న మొన్నటి వరకు ఈ గ్రామాలకి పెద్దగా వ్యవహరిస్తు వచ్చాడు. కానీ.., ఆయన మరణం అనంతరం, ఆయన మనవడు శక్తి వేల్ ని అంతా కలసి తమ నూతన నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికైతే శక్తి వేల్ అన్ని సమస్యలకి తీర్పు చెప్పలేకపోతున్నాడు. అతనికి ఊరి కట్టుబాట్లు అన్నీ అర్ధం అయ్యేలా చెప్పి, కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరీ, తమ నాయకుడిగా కొనసాగించబోతున్నారట. చూశారుగా.. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.