ఇండస్ట్రీకొచ్సి 15 ఏళ్ళు పైనే అయినా ఇంకా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ తగ్గలేదు. వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్ లతో టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. తమన్నా తాజాగా నటించిన సినిమా బబ్లీ బౌన్సర్. ఈ సినిమాలో తమన్నా కొత్తగా కనిపించనుంది. మునుపటి సినిమాల్లో కంటే కొత్తగా ట్రై చేసింది. బౌన్సర్ కేరెక్టర్ చేసింది. ఈ సినిమా కోసం తమ్ము బేబీ కొద్దిగా ఒళ్ళు చేసి కండలు కూడా పెంచింది. నాజూకుగా ఉండే తమన్నా ఈ బబ్లీ రోల్ కోసం బబ్లీగా తయారైంది.ఈ నెల 23న డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బబ్లీ లుక్, బోల్డ్ డైలాగ్స్ తో తమ్ము బేబీ ఇరగ్గొట్టేసింది.
సినిమా పక్కా హిట్ అవుతుందని తమన్నాతో సహా మూవీ యూనిట్ కూడా నమ్ముతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్ జోరు పెంచారు. తమ్ము గాడు మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తమ్ము బేబీ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో తమన్నాతో పాటు సినిమా డైరెక్టర్ మధుర్ బండార్కర్, మిగతా టీమ్ మెంబర్స్ కూడా హాజరయ్యారు. ప్రెస్ మీట్ అన్నాక మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగడం, సెలబ్రిటీల ఫోటోలు అడగడం మామూలే కదా. ఇదే క్రమంలో ప్రెస్ మీట్ అయిపోయాక తమన్నా లేచి వెళ్లిపోతుండగా.. తమ్ము ఫోటోలు తీసేందుకు, ప్రశ్నలు అడిగేందుకు మీడియా వారు ప్రయత్నించారు.
అయితే తమన్నాకి సెక్యూరిటీగా వచ్చిన బౌన్సర్లు.. మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. దీంతో బౌన్సర్లకు, మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కంట్రోల్ తప్పిన బౌన్సర్లు కనబడిన వస్తువులు ఎత్తుతూ.. మీడియా వారి మీదకి విసిరే ప్రయత్నం చేశారు. కాసేపు వీరంగం సృష్టించారు. మీడియా వారిపై దాడి కూడా చేసినట్లు సమాచారం. బౌన్సర్ గా నటించిన తమన్నా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో తమన్నా కోసం వచ్చిన బౌన్సర్లు ఇలా ప్రవర్తించడం విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరేమో పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఇలా చేసి ఉండచ్చునని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.