‘క్యాసెట్ కింగ్’గా పేరు సంపాదించిన గుల్షణ్ కుమార్ – ‘టీ సిరీ’స్ మ్యూజిక్ లేబుల్, నిర్మాణ సంస్థలను స్థాపించారు. 1997లో ఈయనను అంధేరీలో కాల్చి చంపేశారు. అనంతరం తండ్రి స్థాపించిన సంస్థలకు కుమారుడు భూషణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. టీ సిరీస్ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్‌పై రేప్ కేసు పెట్టారు. కేసు నమోదు చేశారు.
ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి, ఓ అమ్మాయిపై అత్యాచారం చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ముంబయి అంధేరీ పోలీసులు ఆయనపై శుక్రవారం 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2017లో తన అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ళపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. 2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ఒక మోడల్ కూడా భూషణ్ కుమార్ పై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది.
తన ఇమేజ్ దెబ్బతీయాడానికే ఇలా చేస్తోందని అప్పట్లో భూషణ్ ఆమె వ్యాఖ్యలను ఖండించాడు.ఈ విషయమై స్పందించిన టీ సిరీస్ సంస్థ ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని, డబ్బుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఓ వెబ్ సిరీస్ కు ఫండింగ్ చేయమని ఓ మహిళా నిర్మాత వచ్చిందని, అప్పుడు ఆమె ప్రపోజల్ ను తిరస్కరించడంతో ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ భూషణ్ కుమార్ పై కేసు పెట్టారని ఓ ప్రకటనలో తెలిపారు.
1997 లో తన తండ్రి గుల్షన్ కుమార్ హత్యానంతరం భూషణ్ కుమార్ టీ సిరీస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. 2001 లో తుమ్ బిన్ తో చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టి పలు విజయవంతైన చిత్రాలు నిర్మించాడు. భూషణ్ కుమార్ 2005 పిబ్రవరి 13న నటి దివ్యా ఖోస్లాను వివాహం చేసుకున్నారు. వీరికిరూహన్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు.