కత్తి మహేశ్.. బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయన తన అలోచనలతో, మాటలతో సమాజాన్ని రెండుగా చీల్చాడు. తనని సమర్ధించే వర్గం ఒకటైతే, తన భావాలను బలంగా వ్యతిరేకించే వర్గం ఒకటి తయారైంది. కానీ.., చనిపోయాక కూడా కత్తి మహేశ్ విషయంలో చర్చ నడుస్తూనే ఉంది. దైవ దూషణే కత్తి మహేశ్ ని బాలి తీసుకుందని, ఇది కర్మ ఫలితం అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని పక్కన పెడితే ఇంకొంత మంది మాత్రం కత్తి మహేశ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కత్తి మహేశ్ చనిపోయిన మరుసటి రోజు నుండి ఇలాంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ.., వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో ఎవరూ పెద్దగా ఈ వాదనని పట్టించుకోలేదు. కానీ.., కత్తి మహేశ్ అంత్యక్రియలకి హాజరైన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ చేసినవ్యాఖ్యలు ఇప్పుడు ఈ ఉహాగానానికి బలం చేకూర్చుతున్నాయి.
కత్తి మహేశ్ అంత్యక్రియలకి మందకృష్ణ మాదిగ, రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రావు, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కనకరావు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.., సీఎం జగన్మోహన్ రెడ్డి, కత్తి మహేష్ ను కాపాడుకొనేందుకు ఎంతో ప్రయత్నించారని, అయితే దురదృష్టవశాత్తు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఇదే సమయంలో ఆయన మరికొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు.
కత్తిమహేష్ మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేయడం విశేషం. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదనని.. ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి బలమైన నేత.. మీడియా ముందు వెల్లడించడంతో అందరిలోనూ ఇప్పుడు సరికొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. యాక్సిడెంట్ అయ్యాక రెండు వారాల పాటు ఆరోగ్యంగా ఉన్న కత్తి.., ఇలా ఒక్కసారిగా ఎలా చనిపోయాడు అన్నది ఇప్పుడు చాలా మంది ప్రశ్న. మరి.. ఈ వ్యవహారంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.