ఫిల్మ్ డెస్క్- మీరు వర్జినా సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో సినిమాల్లో అక్క, వదిన, తల్లి పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. చేసేవి సైడ్ క్యారెక్టర్ పాత్రలైనా.. హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంది సురేఖా వాణికి. ఇక సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సురేఖ. అంతే కాదు సురేఖ వాణి కూతురు సుప్రీత ఆమె కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. గతంలో టిక్ టాక్ వీడియోల నుంచి మొదలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వరకు ఫాలోవర్స్ ను సంపాదించుకుంది సుప్రీత. సోషల్ మీడియాలో సుప్రీత చేసే హంగామా, ఆమె చేసే వీడియోలు చూసి నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతూ ఉంటారు.
టిక్ టాక్ ఉన్న రోజుల్లో తన తల్లితో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. టిక్ టాక్ నిషేధించబడ్డాక అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో కూడా ఆమె రకరకాల వీడియోలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించింది. అందులో నెటిజన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో నువ్వు కన్యవేనా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది సుప్రీత. నువ్వు వర్జినేనా.. అని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఊచించని ఆన్సర్ ఇచ్చింది. వకీల్ సాబ్ సినిమాలో ఇలాంటి సందర్బానికి సంబందించిన సీన్ వీడియో ను షేర్ చేసిన సుప్రీత.. సదరు నెటిజన్ పై కాస్త సీరియస్ అయినట్టు అనిపించింది.
మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. అప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడేమో, నాకు అంత దైర్యం ఎలా వచ్చిందో ఈ రోజుకీ తెలియదు, ఆయన లేకపోవడాన్ని నేను ఇప్పటికీ మిస్ అవుతున్నాను.. కానీ నాకు తెలుసు ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారని అని చెప్పింది సుప్రీత. ఇక ఆ మధ్య సింగర్ సునీత పెళ్లి చేసుకున్న సమయంలో సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో తెలీకుండా మాట్లాడవద్దని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది సుప్రీత.