స్పెషల్ డెస్క్- సురేఖా వాణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సినిమాల్లో చేసేది చిన్న చిన్న క్యారెక్టర్సే అయినా.. తన నటన, అంద చందాలతో ఆకట్టుకుంది సురేఖా వాణి. అందులోను చేసింది తక్కువ సినిమాలే, కానీ ప్రేక్షకుల మదిలో ఇలాగే నిలిచిపోయింది. ఇక సినిమాలే కాదు, సోషల్ మీడియాలో తన కూతురుతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖా వాణి.
నలభై ఏళ్ల వయసులోను కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడే అందం ఆమెదని సోషల్ మీడియాలో సురేఖా వాణి ఫొటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తుంటారు. ఆమె కూతురు కంటే సురేఖా వాణినే అందంగా కనపడుతున్నారని కొందరు డైరెక్ట్‌గా వ్యాఖ్యానిస్తుంటారు. కరోనా సమయంలో కూతురితో కలిసి సోషల్ మీడియాలో సురేఖా వాణి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆమె డ్యాన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.
సురేఖా వాణి గోవాలో జరిగే పార్టీలకు కూతురుతో కలిసి రెగ్యులర్ గా వెళ్తుంది. అక్కడ బాత్ టబ్‌లో నుంచి ఆమె షాంపైన్ బాటిల్‌తో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసినప్పుడు అవి వైరల్ అయిన తీరు సురేఖా వాణికి అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను చెప్పకనే చెప్పింది. ఇదిగో ఇప్పుడు సురేఖా వాణి మరోసారి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో వైన్ గ్లాస్ తో ఉన్న ఫొటోతో అదరగొట్టింది సురేఖ. రెడ్ వైన్ ఉన్న గ్లాస్‌తో ఉన్న ఫొటోను చూసిన నెటిజన్స్ ఎవరికి తోచిన కామెంట్ వారు చేస్తున్నారు.
చేతిలో వైన్ గ్లాసుతో ఉన్న సురేఖా వాణిని చూసిన నెటిజన్స్ లో ఒకరైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని కామెంట్ పెడితే, మరొకరేమో బీర్ తాగకండి మేడమ్ బొజ్జ వచ్చేస్తుంది సజేషన్ చేశారు. ఇంకొక అభిమాని ఐతే మీరు చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎంతైనా సురేఖా వాణి కదా.. ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది మరి.