ఫిల్మ్ డెస్క్- సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. సురేఖా వాణి చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వదినా, అక్క, అమ్మ పాత్రల్లో నటించినా గ్రామర్ ఏ మాత్రం తగ్గించుకుండా స్పెషల్ గా కనిపిస్తుంది సురేఖా వాణి. ఇక ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. దీంతో ఈ తల్లీ కూతుళ్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లు చేసే ఏ వీడియో అయినా బాగా వైరల్ అవుతుంటుంది.
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి చేసే డ్యాన్సులు ప్రత్యేకంగా అభిమానులున్నారు. టిక్ టాక్ హవా ఉన్న రోజుల్లో వీళ్లిద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొత్త కొత్త గెటప్పులు, స్టెప్పులతో హంగామా చేసేవారు. ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో సురేఖా వాణి, సుప్రియ అందాల ఆరబోత కు అంతా ఫిదా అవుతున్నారు. ఆ మధ్య సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సమయంలో సురేఖా వాణి రెండో పెళ్లి గురించి కూడా చర్చ జరిగింది. సురేఖా వాణి సైతం రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం జరగ్గా, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై సురేఖా వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు మొన్నా మధ్య తమ పెంపుడు కుక్క పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడం కూడా సంచలనం రేపింది.
తాజాగా తన పెంపుడు కుక్కతో సుప్రిత ఆడుకోవడంపై సురేఖా వాణి సెటైర్ వేసింది. నేల మీద పడుకుని, పెట్‌తో ముద్దు ముచ్చట్లు ఆడుతూ ఉన్న సుప్రితపై కామెంట్ చేస్తూ.. ఏంటో ఈ పిచ్చి చేష్టలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు సురేఖా వాణి పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. మరి అంతే కదా.. తల్లీ కూతుళ్లు కలిస్తే రచ్చ రచ్చే అని నిటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.