ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసిన జట్టుపై అప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. మంచి ఆటగాళ్లను పట్టించుకోకుండా.. ఫామ్‌లోని ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిందని SRH సోలో ఓనర్ కావ్య మారన్‌ను కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగడంతో మరోసారి SRH ఫ్యాన్స్ కావ్య మారన్‌పై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం బెయిర్‌స్టోను SRH 2021 ఐపీఎల్ తర్వాత రిటేన్ చేసుకోకుండా వదిలేసుకుంది. వేలంలో కూడా బెయిర్‌స్టోను కొనుగోలు చేయలేదు. దీంతో ఇంత మంచి ప్లేయర్‌ను వదులుకుంటారా అంటూ ఫ్యాన్స్ SRH ఫ్రాంచైజ్‌పై మండిపడుతున్నారు.
మెగా వేలంలో బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.6.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం సెంచరీతో సూపర్ ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో ఈ సారి తమ జట్టులో లేడని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ వాపోతున్నారు. బెయిర్ స్టో జట్టులో ఉంటే ఓపెనింగ్ బాగుండేదని భావిస్తున్నారు. గతంలో సన్‌రైజర్స్‌కు బెయిర్‌స్టో అనేక విజయాలు అందించిన సంగతి తెలిసిందే. మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా అందించాడు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. ఈ మెగా లీగ్‌లో బెయిర్ స్టో ఏకంగా 41 సగటుతో పరుగులు రాబట్టాడంటేనే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడిన జానీ బెయిర్‌స్టో 1038 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 114 పరుగులుగా ఉంది. కాగా బెయిర్‌స్టో సెంచరీతో SRH పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉంటే SRH ఫ్యాన్స్ మాత్రం అన్‌హ్యాపీగా ఉన్నారు. మరి SRH బెయిర్‌స్టోను వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Punjab Kings have bought England cricketer Jonny Bairstow in the IPL 2022 Auction on Saturday. Bairstow, who played for Sunrisers Hyderabad in the 2021 season, earned a whopping deal of Rs. 6.75 crore. #JonnyBairstow #PunjabKings pic.twitter.com/v1KQnAJ3NF
— NewsBytes (@NewsBytesApp) February 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.