ఫిల్మ్ డెస్క్- సన్నీలియోన్.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే శృంగార తారగా సన్నీలియోన్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత అనూహ్యంగా భారత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించింది. తాజాగా సన్నీలియోన్ అడల్ట్ కంటెంట్ సినిమా బాయ్స్ మూవీకి సంబందించిన టీజర్ రిలీజ్ చేసింది సన్నీ. అలా అని ఈ సినిమాలో ఆమె నటించలేదు.
కానీ టీజర్ ను మాత్రం సన్నీలియోన్ లాంచ్ చేయడంతో ఈ వీడియోపై అందరికి ఆసక్తి కలుగుతోంది. అంతే కాదు బాయ్స్ సినిమా టీజర్ లోని హాట్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక దీనికి సన్నీ తోడవ్వడంతో యూట్యూబ్ లో బాయ్స్ టీజర్ దూసుకుపోతోంది. ట్రెండింగ్ లో ఉంటూ వ్యూస్ ను, లైక్స్ ను రాబడుతోంది.
దయానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మొన్న విడుదలైన ఈ సినిమాలోని రాజా హే రాజా అనే పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను న్యూ ఏజ్ అడల్డ్ రొమాంటిక్ స్టోరీగా దర్శకుడు దయానంద్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయలేదు.
బాయ్స్ మూవీ టీజర్ చూస్తుంటే మాత్రం అడల్ట్ కంటెంట్‌తో హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 16 సాయంత్రం 5 గంటలకు రిలీజైన ఈ టీజర్ పది లక్షల వ్యూస్ క్రాస్ చేయడంతో పాటు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఈ మూవీలో గీతానంద్‌తో పాటు రోవిత్, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్, షీటల్ తివారీ, సుజీత్, బమ్చిక్ బల్బూ, కౌషల్ మండా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.