టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు మెంటర్‌గా మాజీ కెప్టెన్ ధోని తన సేవలు అందిస్తున్నాడు. అతను జట్టులో చేరిన తర్వాత జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని, డ్రెసింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా మరిపోయిందని వార్తలు వస్తున్నాయి. ధోని మెంటర్‌గా టీమిండియా అద్భుతవిజయాలు సాధించి పెట్టనున్నట్లు, ఈ టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలవడం ఖాయం అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
కాగా ఈ విషయాలపై స్పందించిన టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ లిటిల్ మాస్టర్ సునీల్ గావాస్కర్ మెంటర్‌గా ధోని పాత్ర చాలా పరిమితం అయినదని, మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ధోనికి ఎందుకంత హైప్ ఇస్తున్నారో అర్థం కావడంలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిజంగానే ధోని జట్టులో చేరిన తర్వాత కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు తొలిగి స్నేహం కుదిరినట్లు తెలుస్తుంది. అలాగే ఇషాన్ కిషన్, పంత్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని మరింత సానబెడుతున్నాడు.
కాగా ధోనికి ప్రత్యేకంగా హైప్ చేయాల్సిన అవసరం లేదని, అతను ఏది చేసిన గొప్పగానే ఉంటుందని ధోని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మరి నిజంగానే ధోనికి అనవసరపు హైప్ ఇస్తున్నారా? లేక గావాస్కర్ తప్పుగా అర్థం చేసుకున్నారా? ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంతో తెలియజేయండి.