ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య విడుదలకు సిద్దమవుతోంది. ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఆచార్య లో చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
అచార్య తరువాత చిరంజీవి వరుస సినిమాలకు ప్లాన్ చేసుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ అవుతోంది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు మెగాస్టార్. ఈ రెండు సినిమాలతో పాటు డైరెక్టర్ బాబీతో ఓ సినిమా, మరో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి.
ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి.. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప సినిమా సక్సెస్ తో మంచి ఊపుమీదున్న సుకుమార్, చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారంటే ఆందరిలో ఆసక్తి నెలకొంది.
ఐతే చిరంజీవి, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చేది సినిమాకు కాదు. చాలా కాలం తరువాత చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్ లో కన్పించనున్నారు. ఈ యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అలా సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నట్టు సమాచారం. ఈ సందర్బంగా చిరంజీవితో దిగిన ఓ ఫోటోను సుకుమార్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.