నేటి సమాజంలో కొందరు భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవితంలో మనస్పర్ధలు చేరి ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాలకు సై అంటున్నారు. ఇంతటితో ఆగకుండా కని పెంచిన పిల్లలపై కూడా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి ఓ ఘటనలో కొన్ని విస్తుపోయే నిజాలు ప్రత్యక్షమయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..తమిళనాడు రాష్ట్రంలోని గుడియాట్టం పరిధిలోని జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
సెత్తు అనే 35 ఏళ్ల వ్యక్తికి ఈశ్వరి అనే మహిళతో గతంలో వివాహం జరిగింది. దీంతో కొన్ని రోజులు వారి వివాహ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కొంత కాలం వీరి అన్యోన్యజీవితం ఆనందమయంలో కొనసాగుతున్న తరుణంలో భర్త సెత్తు వేణి అనే యువతితో తెర వెనుక కాపురంలో బిజీగా మారాడు. ఇది గ్రహించిన భార్య ఈశ్వరి పలుమార్లు మందిలించిన భర్త తీరు మాత్రం మారలేదు. ఇక భార్య భర్త తీరును సహించలేక తనలో తాను కమిలిపోతూ రోజు దిగులుగా ఉండేది.
కొన్నాళ్లు భర్త ఈశ్వరితో సన్నిహితంగా ఉండకపోవటం గమనించింది. దీంతో భరించలేని ఈశ్వరి ఒకరోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. దీంతో సెత్తు మరణం నుంచి కోలుకున్న కొంతకాలానికి వేణిని తన ఇంట్లోకి సవతి తల్లిగా తెచ్చుకుని పిల్లలతో పాటు జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాడు. ఇక సవతి తల్లి వేణి మాత్రం ఈశ్వరి పిల్లలపై కాస్త కోపంగా మెలుగుతూ ఉండేది. పిల్లలను కొట్టడం వేధించటం చేయటం మొదలు పెట్టింది. ఇక ఏకంగా ఓ రోజు వేణి 8 ఏళ్ల బిడ్డను కోపంతో శరీరమంతా కాల్చి వాతలు పెట్టింది.
ఇక పిల్లలు ఏడ్చుకుంటూ తమ పెద్దమ్మ వద్దకు పరుగులు తీశారు. బిడ్డ శరీరం నిండా ఎర్రటి వాతలు కనిపించాయి. దీంతో అగ్రహానికి గురైన ఆ పెద్దావిడా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సవతి తల్లితో పాటు భర్తను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేగుతోంది. ఇక సవతి తల్లి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.