ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే మీకో గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 1600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా నిరుద్యోగులు కేంద్ర కొలువు సాధించడం చాలా సులువు.
ప్రభుత్వ ఉద్యోగం నేటి యువత కల. ఇంటర్మీడియట్ పూర్తై ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గోల్డెన్ ఆఫర్. ఆ కలను నిజం చేసుకునే అవకాశం రానే వచ్చింది. ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థలకు ఇదో చక్కటి అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 2023-2024 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ -2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (గ్రేడ్-ఎ) విభాగాల్లో భర్తీ చేపట్టనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు నిబందన, దరఖాస్తు విధానం, జీత భత్యాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
మొత్తం ఖాళీలు: 1600
విభాగాలు: డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్.
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 18-27ఏళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 02,1996 నుంచి ఆగస్టు 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబిసిలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
జీత భత్యాలు: లోయర్ డివిజన్ క్లర్క్ గా ఎంపికైన వారికి రూ.19,900 నుంచి రూ. 63,200 వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఎంపికైన వారికి రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09.05.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 08.06.2023