టీమిండియా సాధించిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో సభ్యుడు, భారత్ వెటరన్ బౌలర్ శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల దేశవాళీ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కెరీర్ ప్రారంభంలో ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్ తర్వాత అనేక వివాదాలతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి 2020లో నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.
శ్రీశాంత్ చివరిసారి గత నెలలో కేరళ, మేఘాలయ మధ్య రంజీ మ్యాచ్‌లో ఆడాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల శ్రీశాంత్ తన రిటైర్మెంట్‌ను ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. కానీ భారమైన హృదయంతో భారత దేశవాళీ క్రికెట్ (ఫస్ట్‌క్లాస్, అన్ని ఫార్మాట్ల నుంచి) నుంచి రిటైవుతున్నా. బాధగా ఉంది. కానీ పశ్చాత్తాపం లేదు. వచ్చే తరం క్రికెటర్ల కోసం ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నా. ఇది నేను తీసుకున్న నిర్ణయమే. ఇది నాకు సంతోషాన్నివ్వదని తెలిసినా.. నా జీవితంలో ఈ సమయంలో ఇది గౌరవప్రదమైన నిర్ణయమే’అని చెప్పాడు.
భారత జట్టు తరఫున శ్రీశాంత్ 27 టెస్టుల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు, ఐపీఎల్‌లో 40 మ్యాచుల్లో 44 వికెట్లు తీశాడు. 2006లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 2011లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ శ్రీశాంత్ ఉన్నాడు.
తొలి ఐపీఎల్‌లో హర్భజన్‌తో గొడవ..
2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో శ్రీశాంత్ పంజాబ్ జట్టులో ఉన్నాడు. మైదానంలో చాలా అగ్రెసివ్‌గా ఉండే శ్రీశాంత్. ఐపీఎల్‌లోనూ తన సహజ శైలినే ప్రదర్శించాడు. ముంబై, పంజాబ్ మ్యాచ్ అనంతరం మైదానంలో ఏడుస్తూ కనిపించాడు. శ్రీశాంత్.. విషయం ఆరా తీయగా హర్భజన్ తనపై డ్రెస్సింగ్ రూమ్‌లో తనపై చేయి చేసుకున్నట్లు తెలిపాడు. ఆ సమయంలో భజ్జీ ముంబై జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. మ్యాచ్‌లో జరిగిన ఘటనపై సీరియస్ అయిన భజ్జీ.. పంజాబ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి శ్రీశాంత్‌పై చేయిచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వివాదంతో మొదలైన శ్రీశాంత్ కెరీర్.. అదే దారిలో సాగింది. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్‌కు భజ్జీ శుభాకాంక్షలు తెలిపాడు. శ్రీశాంత్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. గుడ్ లక్ శేంట అని పేర్కొన్నాడు.
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్..
ఐపీఎల్ 2013 సీజన్ సందర్భంగా శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా.. బీసీసీఐ అతనిపై జీవితాంతం నిషేధం విధించింది. దీనిపై న్యాయ పోరాటానికి దిగిన శ్రీశాంత్.. చివరకు తనపై బోర్డు వేసిన నిషేధాన్ని తగ్గించుకున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ నిషేధం పూర్తవ్వగా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా శ్రీశాంత్ ప్రాక్టీస్ చేశాడు. కానీ అనుకున్నది సాధించలేకపోయాడు. కనీసం ఐపీఎల్‌లో అయినా ఆడాలని భావించిన అతనికి నిరాశే ఎదురైంది.
వరుసగా రెండు సీజన్ల వేలంలో రూ.50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్నా అతన్ని ఫ్రాంచైజీలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి విదేశీ లీగ్స్ ఆడాలని శ్రీశాంత్ నిర్ణయించుకున్నాడు. ఇక బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటానికి వీలు లేదన్న విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే శ్రీశాంత్ బీబీఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో కనిపించనున్నాడు. మరి శ్రీశాంత్ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It has been an honor to represent my family, my teammates and the people of India. Nd everyone who loves the game .
With much sadness but without regret, I say this with a heavy heart: I am retiring from the Indian domestic (first class and all formats )cricket ,
— Sreesanth (@sreesanth36) March 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.