ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పిన శ్రీరెడ్డి గురించి అందరికి తెలిసిందే. అర్దనగ్నంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆంచోళన చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది శ్రీరెడ్డి. ఆ తరువాత సినిమా పరిశ్రమకు సంబందించిన చాలా అంశాలపై స్పందించడంతో పాటు, పలువురి హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి.
ఓ వివాదానికి సంబందించిన అంశంలో శ్రీరెడ్డి మొన్నా మధ్య మెగాస్టార్ చిరంజీవి తల్లిగారైన అంజనీదేవిని దూషించింది. దాంతో మెగా అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై విమర్శలు గుప్పించారు. వివాదంతో ఏ మాత్రం సంబందం లేని చిరంజీవి తల్లిగారిని తిట్టడంతో శ్రీరెడ్డి ట్రోలింగ్ ఎదుర్కొంది. చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది. ఈ మేరకు శ్రీరెడ్డి ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేసింది.
ట్విట్టర్ వీడియోలో శ్రీరెడ్డి ఏమందంటే.. ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నా. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను.
అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి.. అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.
నన్ను క్షమించండి “అంజనమ్మ” 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt
— Sri Reddy (@MsSriReddy) January 22, 2022