ఎస్పీ బాలసుబ్రమణ్యం.. సినీ సంగీత ప్రపంచంలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. గాన గంధర్వుడిగా ఆయన సాధించిన స్వర జైత్రయాత్ర అందరికీ సాధ్యం అయ్యేది కాదు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీబీ తన గాత్రంతో సినిమా పాటని పల్లకిలో ఊరేగించి తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. ఆయన చనిపోయి సంవత్సరం గడుస్తున్నా.. సంగీత ప్రియులు ఇంకా ఆ వార్తని జీర్ణం చేసుకోలేక, ఆయన వదిలి వెళ్లిన పాటల జ్ఞాపకాల్లోనే ఉండిపోయారు.
ఈ మధ్య కాలంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆస్తులు అమ్మేస్తున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని సినిమాలు నిర్మించి నష్టాలపాలైన ఎస్పీబీ కొడుకు చరణ్.. ఆ అప్పులు తీర్చడానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటున్నాడని సోషల్ మీడియాలో ఓ ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ.., వీటిల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చారు.
“నాన్నగారి ఆస్తులు అమ్మేస్తున్నానన్న అంశంలో ఎలాంటి నిజం లేదు. నా సినిమాలు, నా అప్పులు, నా నష్టాలు కారణంగా నాన్నగారి ఇమేజ్ ని నేను ఎప్పుడూ డ్యామేజ్ చేయలేదు, చేయను కూడా. సినిమాల్లో నష్టాలూ వచ్చాయని నేనెప్పుడూ నాన్న గారిపై ఆధారపడలేదు. నా అప్పులని తీర్చడానికి నేను ఇతర దారులని వెతుకున్నా అని చరణ్ పేర్కొన్నారు.
నిజానికి ఈ వార్తలు రావడానికి వేరే కారణం ఉంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కోదండపాణి స్టూడియోస్ ను ఎస్పీ చరణ్ ఈ మధ్య క్లోజ్ చేశారు. నిజానికి ఇది అమ్మేసింది కూడా డబ్బు కోసం కాదు, స్టూడియోలో రికార్డింగ్స్ తగ్గిపోయాయి. దాంతో స్టూడియోలో పనిచేసేవారికి సరైన పనులు లేక, అనివార్య పరిస్థితుల్లో స్టూడియోని అమ్మేశారు. దీంతో.., ఎస్పీ చరణ్ ఆయన తండ్రి ఎస్పీ బాలు ఆస్తులు అమ్మేస్తున్నారంటూ ఓ తప్పుడు ప్రచారం మొదలయింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.