కరోనా టైంలో సోనూ సూద్ సాయం కోరిన వారికి ఎటువంటి సాయమైనా కూడా లేదనకుండా చేసాడు. అలా ఆయన సాయాన్ని ఎందరో పొందారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలకు, బాబాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయాడు. కష్టం అంటే చాలు సాయం చేయడానికి ఎగబడి వెళ్లిపోయేవాడు. ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా ఆయన సాయాన్ని పొందేందుకు జనాలు ఆత్రుత చూపిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన ఇంటి వద్దకే వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్ మెసేజ్‌లు చేస్తున్నారు. ప్రతీ ఊర్లోనూ ఇప్పుడు సోనూసూద్ పేరే వినిపిస్తోంది. ఎంతో ఓపిగ్గా చాలామంది ట్వీట్లు చదివి స్పందిస్తూ ఉండే అతనికి రీసెంట్ గా విచిత్రమైన ట్వీట్ వచ్చింది. అయితే సోనూ సూద్ ఏమాత్రం చిరాకు పడకుండా చక్కటి పంచ్ ఇచ్చాడు. ఓ వ్యక్తి ఫన్నీగా సాయాన్ని అడిగాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వాలని నన్ను పదే పదే అడుగుతూ ఇబ్బంది పెడుతుంది మీరు ఏమైనా సాయం చేయగలరా అంటూ సోషల్ మీడియా లో రిక్వెస్ట్ చేశారు. ఆ సాయం అందుతుందో లేదో కానీ నీ దగ్గర ఉన్నది మాత్రం మొత్తం పోతుంది అంటూ సోనూ సూద్ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చదివి కొందరు మారినా సోనూ సూద్ కి చిరాకు తప్పుతుంది. బిజీగా ఉన్నా ఎదో తీరిక చేసుకొని సోనూ ఇలా సాయం చేస్తుంటే టైం పాస్ మెసేజ్ లు చేయడమేంటనీ నెటిజన్లు ఆయన అభిమానులూ ఆ కుర్రాడిపై మండిపడుతున్నారు. ‘సోనూ అన్నా భలే బుద్ది చెప్పా’రంటూ కొందరు అభినందించారు. ఈయన సినిమాల విషయానికొస్తే ఆచార్య సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
उसका तो पता नहीं,
अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा😂 https://t.co/t99rnT8z22— sonu sood (@SonuSood) June 22, 2021