ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ తెలుసు కదా. ఆదేనండీ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ముద్దుల కూతురు. ఆవును సోనమ్ కపూర్ ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఎంతక్కా సంసార జీవితాన్ని అనుభవిస్తోంది. అడపాదడపా సినిమాలు కూడా చేస్తోందనుకొండి. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సోనమ్ కపూర్ గురించి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఓ విషయాన్ని చెప్పారు.
భారత దేశ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన భాగ్ మిల్కా భాగ్ సినిమా భారీ విజయం సాధించిన విషయం కొత్త చెప్పక్కర్లేదు. కనీవినీ ఎరుగని కలెక్షన్లతో పాటు, అందరి ప్రశంసలూ అందుకుందీ చిత్రం. భాగ్ మిల్కా భాగ్ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఫరాన్ అక్తర్, సోనమ్ కపూర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఓ అధ్భుతమైన క్రీడాకారుడు మిల్కాసింగ్ బయోగ్రఫీ సినిమాలో నటించడం గౌరవంగా భావించి నటీ నటులు నామమాత్రపు పారితోషికం తీసుకుని నటించారు.
ఈ సినిమాలో నటించేందుకు సోనమ్ కపూర్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా.. కేవలం కేవలం 11 రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని భాగ్ మిల్కా భాగ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తన బయోగ్రఫీలో చెప్పారు. ఆయన సోనమ్ కపూర్ గురించి ఏమన్నారంటే.. ఇది లవ్‌స్టోరీ కాదని సోనంకు ముందే తెలుసు.. బాల్యంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది.. ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే అంగీకరించింది.
ఈ కథలో ఎలాగైనా భాగం కావాలని తను ముందే నిర్ణయించుకుంది.. భాగ్ మిల్కా భాగ్ కథ చెప్పగానే సోనమ్ కపూర్ వారం రోజులు సమయం అడిగింది.. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది.. అని దర్శకులు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా చొప్పుకొచ్చారు. నిజంగా సోనమ్ కపూర్ గ్రేట్ కదా.