బిడ్డలు తప్పు చేస్తే కన్నవారు కడుపులో పెట్టుకుని కాచుకుంటారు. అది తల్లి ప్రేమ. కానీ.., తెలిసో తెలియకో ఓ తల్లి తప్పు చేసింది. కానీ.., ఆమె కుమారుడు మాత్రం ఆ తప్పుకి శిక్షగా తల్లినే హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా మద్నూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., మద్నూర్‌లో గోసం లక్ష్మికి గతంలోనే వివాహం జరుగగా ఆమెని భర్త వదిలివేశాడు. దీంతో.., లక్ష్మి కొడుకుతో సహా వచ్చి తన తమ్ముడి దగ్గర నివాసం ఉంటుంది.
ఈ క్రమంలో లక్ష్మీకి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం అయ్యింది. అతనితో సన్నిహితంగా ఉంటూ.., హద్దులు దాటింది లక్ష్మీ. ఈ విషయం కాస్త ఆలస్యంగానే లక్ష్మీ కొడుకు, తమ్ముడుకి తెలిసింది. వారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ పరువు తీస్తున్న తల్లిని ప్రాణాలతో మిగల్చకూడదని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడువుగా.., నిద్రపోతున్న తల్లిపై కత్తితో దాడిచేసి, గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి అతని మేనమావ సహకరించాడు. అయితే.., బాధితురాలు కేకలకి ఇరుగు, పొరుగు వాళ్లు ఇంట్లోకి వచ్చి లక్ష్మీని కాపాడారు.దీంతో.., లక్ష్మీ కొడుకు, తమ్ముడు అక్కడ నుండి పారిపోయారు. లక్ష్మి ప్రస్తుతం నిజామాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందుకుంటుంది. బాధితురాలి కూతురు శీరిష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరి.., పరువు కోసం తల్లినే చంపబోయిన ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.