సాధారణంగా పాములు పగబడతాయి అని అంటుంటారు. తమకు హాని చేసిన వ్యక్తులను గుర్తుంచుకొని మరీ వారిని చంపే వరకు వదిలిపెట్టవని అంటుంటారు. కొందరు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేస్తారు. మరికొందరు నాగ దోషమేదైనా ఉందేమోనని దోష నివారణ పూజలు చేయిస్తారు. ఇక పాములకు సంబంధించి ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్ లో చూస్తూనే ఉన్నాం. పాములు పగబట్టి చంపడం అనేది అప్పుడప్పుడు వార్తల్లో కూడా చూస్తున్నాం.
ఇది చదవండి: అనాథ యువతికి ఘనంగా వివాహం చేసిన గ్రామస్థులు!
చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓ కుటుంబాన్ని పాము పగబట్టినట్లుగా.. ఒకే నెలలో ఆరు సార్లు కాటేసింది. అదృష్టం కొద్ది సకాలంలో స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలిస్తుండటంతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, డోర్ణకంబాల పంచాయతీకి చెందిన వెంకటేశ్, వెంకటమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు జగదీష్. కుమారుడు జగదీశ్‌తో పాటు డోర్ణకంబాల గ్రామానికి చివరన గల కొండకింద భాగాన జీవిస్తుంటారు.
గత నెలలో వెంకటేశ్, వెంకటమ్మ, జగదీశ్‌లను రెండేసి సార్లు పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి 108 నంబరుకు కాల్ చేసి.. ఆస్పత్రికి తరలించడంతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకటమ్మ, జగదీష్‌లను సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాము కాటేసింది. మళ్లీ స్థానికులు 108కి కాల్ చేసి.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ప్రాణాలతో బయటపడినా.. తమకు కాటు వేసింది ఒకే పాము అయితే అది ఖచ్చితంగా తమపై పగబట్టే ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.