నిత్యం వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ రైల్వేస్. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సంస్కరణలను చేపడుతూ ప్రయాణికుల ఆదరణ పొందింది.
నిత్యం వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ రైల్వేస్. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సంస్కరణలను చేపడుతూ ప్రయాణికుల ఆదరణ పొందింది. కాగా రైలు వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ట్రైన్స్ తరచు ప్రమాదాల భారిన పడుతు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి -సికింద్రాబాద్ వందేభారత్ రైలులో పొగలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రయాణికులతో తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన వందేభారత్ ట్రైన్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటన బుదవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు రెల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ట్రైన్ బోగీలో పొగలు రావడం గుర్తిచిన సిబ్బంది లోకోపైలట్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లోకోపైలట్ రైలును మనుబోలు స్టేషన్లో నిలిపివేశారు. అప్పటికే ప్రాణ భయంతో వణికిపోతున్న ప్రయాణికులు బోగీల నుంచి కిందికి దిగి పరుగులు తీశారు.
అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్ బోగీలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగి పడేయడంతో బోగీలో పొగలు వ్యాపించినట్లు గుర్తించారు. ఘటనకు కారణమైన వ్యక్తి పారిపోతుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే సిబ్బంది ట్రైన్ లో పొగలను పూర్తిగా ఆర్పేసి ప్రమాదం ఏమీ లేదని నిర్థారించుకున్న తర్వాత మళ్లీ ట్రైన్ ను పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.