సినిమాని థియేటర్లో చూస్తేనే మజా. ప్రేక్షకుల అరుపుల మధ్య మూవీని ఎంజాయ్ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ సభ్యులు సైతం రిలీజ్ రోజు థియేటర్లలో తమ సినిమాలు చూడటం మెుదలు పెట్టారు. చూశాక తమ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తన సినిమాని ప్రేక్షకుల మధ్య చూసి కన్నీరు కార్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
హను రాఘవపూడి దర్శకత్వంతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతా రామం. వైజయంతి బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో చిత్ర యూనిట్ మూవీని వీక్షించింది. ఈ సందర్భంగా అక్కడ ఓ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.
సీతా రామం సినిమా ప్రేక్షకుల మధ్య చూసి బయటకు వచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కన్నీరు పెట్టుకుంది. డైరెక్టర్ హను రాఘవపూడిని హత్తుకుని ఏడ్చింది. మూవీలో తన క్యారెక్టర్ చూశాక ఆనందాన్ని ఆపుకోలేక పోయింది మృణాల్. తన అభిమానాన్ని కన్నీరు ద్వారా దర్శకుడికి చెప్పింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది.
హీరో దుల్కర్ సల్మాన్ సైతం డైరెక్టర్ ని హత్తుకుని అభినందించాడు. ఈ పరిణామానికి హను రాఘవపూడి ముఖంలో నవ్వులు విరపూశాయి. దాంతో అక్కడ ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. సినిమా చూసి హీరోయిన్ కన్నీరు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
That moment 🥹 @dulQuer @mrunal0801 @hanurpudi got emotional after watching movie with fans in Hyderabad#SitaRamamFDFS#SitaRamam @ArtistryBuzz @VyjayanthiFilms #dulqersalman #dulquersalmaan #MrunalThakur #southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/zfrIsQWxXw
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) August 5, 2022