స్పెషల్ డెస్క్- పెళ్లి.. ఆ సందడే వేరు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు.. భలే ఉంటుంది కదా. ఒకప్పుడు పాత రోజుల్లో అసలు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒకరిని ఒకరు చూసుకునే వాళ్లే కాదట. ఆ తరువాత క్రమంలో పెళ్లి చూపులు నుంచి మొదలై ఇప్పుడు డేటింగ్ చేసి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. పెళ్లిళ్లలో బావా మరదలు ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటారు. అది సర్వసాధారనం అని చెప్పవచ్చు. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా, ప్రేమ పెళ్లయినా ఇరువురి కుటుంబాలు వివాహ వేడుకలో సరదాగా ఉంటాయి. ఇక వధువు చెల్లిళ్లయితే బావను ఆటపట్టిస్తూ, వేలాకోలం అడుతూ ఉంటారు. చాలా కుటుంబాల్లో పెళ్లి వేడుకలో భాగంగా బావ చెప్పులను మరదలు దాచి డబ్బులు వసూలు చేయడం చూస్తుంటాం.
ఇక ఈ మధ్య కాలంలో వివాహ వేడుకలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురు పెళ్లి పీఠలపైనే ముద్దు పెట్టుకోవడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదేం విడ్డూరమని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. ఐతే అంతకు మించిన ఘటన ఓ పెళ్లి వేడుకలో జరిదింది. అది చూస్తే మాత్రం మీరు ఇదేం కలికాలంలా బాబు అని అనుకోక మానరు. అసలేం జరిగిందంటే.. అక్కడో వివాహ వేడుక జరుగుతోంది. పెళ్లి తంతు ముగిశాక అంతా కలిసి వధు వరులతో ఫోటోలు దిగుతున్నారు. పెళ్లి కూతురు చెల్లెలు సైతం ఫోటోకు ఫోజిచ్చింది. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. హఠాత్తుగా తనకు బావ అయిన పెళ్లి కొడుకును గట్టిగా ముద్దు పెట్టుకుంది ఆ అమ్మాయి. అది కూడా మమూలుగా కాదు.. పెళ్లి కొడుకు తలను పట్టుకుని గట్టిగా బుగ్గపై ముద్దు పెట్టింది వధువు చెల్లెలు.
దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. పెళ్లి కొడుకు సైతం ఈ అనుకోని పరిణామానికి షాక్ తిన్నాడు. ముద్దు పెట్టుకున్న మరదలి వైపు చూస్తూనే జారి పడిపోయిన తన తలపాగాను సర్దుకున్నాడు పెళ్లి కొడుకు. అసలేం జరిగిందో అర్దం కాక బిక్కమొహం వెసుకుని చూస్తోంది పెళ్లి కూతురు. బావకు ముద్దు పెట్టిన అమ్మాయి మాత్రం ఏ మాత్రం తడబాటు లేకుండా కనిపించింది. అసలేం జరిగిందో అర్ధం కాక పెళ్లికి వచ్చిన బంధువులు తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి పెళ్లి కూతురు చెల్లెలు అలా బావను అంత మంది ముందు ఎందుకు ముద్దు పెట్టుకుందో మాత్రం చెప్పలేదు. కలికాలం కాబట్టి ఇలాంటివన్నీ జరుగతూనే ఉంటాయని పెళ్లికి వచ్చిన ఓ పెద్దమనిషి కామెంట్ చేయడం కొసమెరుపు.