ఫిల్మ్ డెస్క్- ప్రముఖ సినీ గాయని సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయ్యింది. తన సినీ కేరీర్ కు సంబందించిన విషయాలతో పాటు, కుటుంబానికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది సునీత.
ఈ క్రమంలోనే తాజాగా సునీత ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త రామ్ వీరపనేనితో కలిసి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని సమతా మూర్తి విగ్రహం వద్దకు సునీత తన భర్తతో కలిసి వెళ్లింది. సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోటోపై నెటిజన్స్ నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయు.
కాకి ముక్కుకు దొండ పండు, సునీతకు ముసలి రామ్ మొగుడు, అందం ఈమె సొంతం ధనము ఆయన సొంతం, గానం ఈవిడది దర్జా అతనిది.. అని హద్దులు దాటి కామెంట్స్ చేశాడో నెటిజన్. అతడి కామెంట్స్ చూసి సునీత తనదైన స్తైల్లో కౌంటర్ ఇచ్చింది. సదరు నెటిజన్ మళ్లీ నోరెత్తకుండా అతని పంధాలోనే సమాధానం చెప్పింది సునీత.
నోటి దూల నీది.. నీ భారం భూమిది.. అని ఆ నెటిజన్ కు తన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చింది సునీత. ఆమె ఇచ్చిన ఈ కౌంటర్‌కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ నోటిదూల నెటిజన్ కు సరైన విధంగా గుణపాఠం చెప్పారని సునీతను పొగొడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకూడదని నెటిజన్స్ హితువుపలుకుతున్నారు.