చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఐఐటీలో చదివి ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. అతడు సంతృప్తిగా బతకడమే కాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు. ఉద్యోగం వదిలి 20 ఆవులను కొన్నాడు. వాటితో ఇప్పుడు ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. కర్ణాటకకు చెందిన కిశోర్ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికి అతడికి సంతృప్తి లేదు. దీంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఓ సారి పని నిమిత్తం కిశోర్ హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అతడు నగరవాసులు స్వచ్ఛమైన పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాడు. ఆ సమయంలో కిశోర్‌కి వచ్చిన ఓ ఆలోచన అతడి జీవితాన్ని టర్న్ అయ్యేలా చేసింది. 2012లో ప్రారంభించిన ఈ బిజినెస్ ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగింది.
తన కొడుకు సిద్ధార్థ పేరుతో సిద్ ఫమ్ అని తన వ్యాపారానికి పేరు పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. ఇక పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు కిశోర్. కోరిక ఉండి దాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదల ఉండే సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్పడానికి కిషోర్ ఇందుకూరి కన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో!