కేవలం 2 లక్షల 50 వేల రూపాయల కోసం ఓ ఎస్‌ఐ తన జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. తాను పని చేస్తున్న పోలీస్ శాఖకు చెడ్డ పేరు తేవటమే కాదు. పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు.
2 లక్షల రూపాయల కోసం కక్కుర్తి పడి ఓ ఎస్‌ఐ బంగారం లాంటి తన జీవితాన్ని ఆగం చేసుకున్నాడు. ఏకంగా సీజ్ చేసిన గంజాయి వాహనాన్ని వదిలేసి ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోటు గూడానికి చెందిన బాసింశెట్టి సత్తిబాబు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి నుంచి సీజ్ చేసిన గంజాయి వాహనాన్ని 2 లక్షల 50 వేల రూపాయల లంచం తీసుకుని వదిలేశాడు.
అయితే, అనుకోని విధంగా ఈ విషయాన్ని వాహనం డ్రైవర్ బయటకు చెప్పాడు. దీంతో ఎస్‌ఐ చేసిన పని అందరికీ తెలిసింది. అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సత్తిబాబు వదిలేసిన వాహనాన్ని నెల్లూరు జిల్లా పోలీసులు మళ్లీ పట్టుకున్నారు. అధికారులు సత్తిబాబును విచారణ నిమిత్తం రంపచోడవరం ఏసీపీ కార్యాలయానికి రప్పించారు. అయితే, ఏసీపీ కార్యాలయం నుంచి ఎస్‌ఐ సత్తిబాబు బస్సులో పారిపోయినట్లు తెలుస్తోంది.
దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రభుత్వాలు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎక్కడికక్కడ గంజాయి వాహనాలు పట్టుకుని రవాణాను అడ్డుకుంటున్నారు. కానీ, ఇలాంటి కొంతమంది కారణంగా గంజాయి అక్రమ రవాణా ఎథేచ్చగా సాగుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఎస్‌ఐ సత్తిబాబు ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.