నేషనల్ డెస్క్- ఏ పరీక్ష రాయాలన్న ముందు క్వశ్చన్ పేపర్ ఉండాలి. క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నలను బట్టి వాటికి సమాధానాలు రాస్తాం. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు ఐఏఎస్ పరీక్ష వరకు క్వశ్చన్ పేపర్ కాస్త ఈజీగా ఉండి, సులభమైన ప్రశ్నలు వస్తే బావుండు అని అనుకుంటూ ఉంటారు అంతా. మరి అంతే కదా క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నకు ఎంత మేర ఆన్సర్ రాయాలో ప్రతి ఒక్కరు ఓ అంచనాకు వస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు క్వశ్చన్ పేపర్ లో ప్రశ్నలే లోకపోతే. ఇదేం ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ అన్నాక తప్పకుండా ప్రశ్నలు ఉండాల్సిందే కదా.. అప్పుడే దాన్ని క్వశ్చన్ పేపర్ అంటాం కదా అని మీకు సందేహం కలగవచ్చు. ప్రపంచంలో ప్రశ్నలు లేని క్వశ్చన్ పేపర్ మొట్టమెదటి సారి వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే ప్రశ్నలు, జవాబులు కూడా మీరే రాసుకోండి అని క్వశ్చన్ పేపర్ లో ఉంది.
నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల జరిగింది. హా ఇలాంటివి ఎక్కడో విదేశాల్లో జరిగి ఉంటాయిలే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఇలా ప్రశ్నలు లేని క్వశ్చన్ పేపర్ ను మన ఇండిలోనే ఐఐటీ తయారు చేసింది. గోవా ఐఐటీ అనలాగ్ సర్క్యూట్స్ ఎగ్జామ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సెమిస్టర్‌లో నేర్చుకున్నదానిని బట్టి ఈ పరీక్షలో సొంతంగా ప్రశ్నలు తయారుచేసి దానికి జవాబులు రాసి ఇవ్వాలని ఐఐటీ కోరింది. దీంతో క్వశ్చన్లు లేని పేపర్ ను చూసి మొదట ఐఐటీ విద్యార్థులు షాకయ్యారు. ఆ తర్వాత కోలుకుని తమకు తోచిన ప్రశ్నలు వాళ్లే రాసుకుని, ఆ ప్రశ్నలకు జవాబులు రాసి పరీక్షను కానిచ్చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గోవా ఇచ్చిన ఈ పరీక్ష పేపర్‌లో మొత్తం సెమిస్టర్ లో మీకు ఇచ్చిన లెక్చర్ మెటీరియల్స్ నుంచి 60 మార్కుల ప్రశ్నలు రూపొందించండి అని సూచించారు.
మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారనే దానిని ఇది తెలియజేస్తుందని, ప్రశ్నలు తయారుచేసిన తర్వాత రెండు గంటల్లో జవాబులు కూడా రాయండని ఆ పేపర్‌లో రాసి ఉంది. అంతే కాదు పక్కన పరీక్ష రాస్తున్న మీ స్నేహితులతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దని కూడా పేపర్ లో రాశారు. ఎవరో ఈ పేపర్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ వైరల్ అవుతోంది. ఐతే విద్యార్థులు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారన్నది ఈ దెబ్బతో తేలిపోతుందంటూ ఐఐటీ గోవాకు అనుకూలంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఐఐటీ గోవా క్వశ్చన్ పేపర్ మాత్రం సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.