ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నీలి చిత్రాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. భర్త చేసే పోర్న్ బిజినెస్ తో శిల్పా శెట్టికి కూడా సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శిల్పా శెట్టిని ముంబయి పోలీసులు విచారించారు.
ఐతే తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని, హాట్ షాట్స్ యాప్ లోని కంటెంట్ ఏమిటన్న వివరాలు తనకు తెలీయవని శిల్పాశెట్టి ముంబై పోలీసులకు చెప్పారు. ఇంతకు మించి తనకేం తెలియదని అన్నారు. తన భర్త రాజ్ కుంద్రాకు వరసకు బావ అయ్యే ప్రదీప్ బక్షి హాట్‌షాట్స్ యాప్‌ను చూసుకుంటున్నారని పోలీసులకు చెప్పారు శిల్పా శెట్టి. కుంద్రా నీలి చిత్రాలను తీయలేదని, శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉందని శిల్ప శెట్టి పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది.
రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో ఇప్పటి వరకూ 7.5 కోట్ల రూపాయల నగదును, సుమారు 48 టెరాబైట్లు ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత మంది ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోర్న్ చిత్రాల్లో నటించిన వారి వివారాలను ముంబై పోలీసులు సేకరిస్తున్నారు. వారందరిని విచారిస్తే నీలి చిత్రాల కేసులో పురోగతి వస్తుందని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.