ఫిల్మ్ డెస్క్- ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నీలి చిత్రాలను చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నాడన్న ఆరోపణల నేపధ్యంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈనెల 23వరకు రాజ్ పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు. నీలి చిత్రాల చిత్రీకరణ ఆరోపణలపై రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై 2021 ఫిభ్రవరిలో పోలీస్ కేసు నమోదైంది. సుమారు ఐదు నెలల విచారణ తరువాక ఎట్టకేలకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ ను అరెస్ట్ చేశారు. దీంతో గతంలో రాజ్ కుంద్రా ఇదే విషయంపై చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2012, మార్చి 29వ తేదీన రాజ్ కుంద్రా వ్యభిచారానికి, పోర్న్‌కు లింక్ పెడుతూ పోర్న్ VS ప్రాస్టిట్యూషన్ అని తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు.
ఒక వ్యక్తికి డబ్బులిచ్చి శృంగారం చేయడానికి, శృంగారం చేస్తున్న వ్యక్తులను కెమెరాలో షూట్ చేసి, ఆ వీడియోను డబ్బులు పెట్టి చూడటానికి పెద్ద తేడా ఏముందని ప్రశ్నించాడు రాజ్ కుంద్రా. కెమెరా ముందు శృంగారం చేయడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదని ప్రశ్నిస్తూ రాజ్ కుంద్రా గతంలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంటే 2012 నుంచి రాజ్ కుంద్రా ఈ నీలి చిత్రాల వ్యాపారం చేస్తున్నార అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Ok so here go’s Porn Vs Prostitution. Why is it legal to pay someone for sex on camera? How is one different to the other??
— Raj Kundra (@TheRajKundra) March 29, 2012