ఉత్తర్ ప్రదేశ్- ఈ కాలంలో వివాహ బంధం పెడదారి పడుతోంది. పెళ్లయ్యాక కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో కుటుంబాల్లో కలతల రేుగుతున్నాయి. వయసు తారతమ్యాలు లేకుండా, వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు. దీంతో సమాజంలో ఇలాంటి వారి పట్ల ఎవగింపు పెరిగిపోతోంది.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మొహల్లాకు చెందిన 45 ఏళ్ల మహిళకు ఐదుగురు కూతుళ్లున్నారు. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. రెండేళ్లలోనే భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లిచేసుకుంది. కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదంలో రెండో భర్త కూడా మరణించాడు. దీంతో కొన్నాళ్లు ఒంటరిగా గడిపిని ఆ మహిళ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. మొత్తానికి ఆమెకు ఐదు మంది ఆడపిల్లలు పుట్టారు.
పెద్ద కుమార్తె కు 21 ఏళ్లు రావడంతో ఈ మధ్యనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. మూడో భర్తతో కాపురం చేస్తుండగా 21 ఏళ్ల కుర్రాడు మిథున్‌తో ప్రేమలో పడింది ఆ మహిళ. ఈ సమయంలోనే ఆమె మూడో భర్త అనారోగ్యంతో చనిపోవడం ఆమెకు బాగా కలిసివచ్చింది. ఇక ఆమహిళకు, ఆమె ప్రియుడికి పట్టపగ్గాల్లేవనే చెప్పవచ్చు. ఈ విషయం ఊళ్లో తెలిసి అంతా చెడుగా మాట్లాడుకుంటుండటంతో ఆ మహిళ కూతుళ్లు ఆవేధన చెందారు.
నలుగురు కుమార్తెల్లో19 ఏళ్లు, 16 ఏళ్లు, 14 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న వారున్నారు. తన పెద్ద కుమార్తె వయసున్న ఓ కుర్రాడితో ప్రేమాయణం మొదలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కూతుళ్లు, ఇది తప్పు.. వద్దమ్మా అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతే కూతుళ్లపై ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహిళ వారందరిని ఇంటి నుంచి బయటకు గెంటేసి, ప్రియుడితో ఏకంగా కాపురమే పెట్టేసింది. అంతే కాదు ఆ మహిళ తన ప్రియుడితో పెళ్లికి కూడా సిద్ధమవడంతో కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు.
మేం మేజర్లం, మాకిష్టం వచ్చినట్టు బతుకుతాం, మీకేంటి నష్టం అని పోలీసులకు వాళ్లిద్దరు సమాధానం చెప్పడంతో అంతా ఖంగు తిన్నారు. ఆమెను నా భార్యగా చేసుకుంటా, ఆమె కూతుళ్లను నా కూతుళ్లుగా చూసుకుంటా, భవిష్యత్తులో వాళ్లకు అండగా ఉంటా అని ఆ మహిళ ప్రియుడు చెప్పడంతో ఇక పోలీసులు కూడా ఏం మాట్లాడలేకపోయారట. కలికాలం అంటే ఇదే మరి.