ఈ మద్య కొంత మంది ఆకతాయిలు రైల్వే స్టేషన్లు, బస్టాండు, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో బాంబు ఉందని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో వెంటనే అధికారులు అలర్ట్ ఆయా ప్రదేశాలకు వెళ్లి బాంబు తనిఖీ చేస్తారు.. అక్కడ ఏ బాంబ్ లభించకపోవడంతో అది ఫేక్ కాలని కొట్టిపడేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి బయలు దేరారు. అక్కడ ఆగి ఉన్న ట్రైన్ లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
శబరి ఎక్స్ ప్రెస్ రైలు బాంబ్ ఉందని ప్రయాణీకులకు తెలియడంతో భయంతో వణికిపోయారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని పోలీసులు ప్రయాణీకులకు తెలిపారు. దాదాపు ఒక గంట పాటు రైల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసులు. మొత్తానికి అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి శబరి ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన సెల్ ఫోన్ కాల్ ను ఫేక్ కాల్ గా గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళ రాష్ట్ర ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చటంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని శబరీ ఎక్స్ప్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఫేక్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలను భయ బ్రాంతులకు గురి చేయడానికి కొంతమంది ఆకతాయిలు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.