బిజినెస్ డెస్క్- ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం అంతకంతకు విస్తరిస్తూ పోతోంది. ప్రధానంగా ఇన్సూరెన్స్ మనిషి జీవితంలో కీలకంగా మారింది. విదేశాల్లో ఐతే దశాబ్ధాల క్రితమే ఇన్సూరెన్స్ రంగం వెళ్లూనుకుంది. కానీ భారత్ లో ఈ మధ్య కాలంలోనే అందరిలో ఇన్సూరెన్స్ పై అవగాహన పెరుగుతోంది. అందులోను లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన్యతను అందరు గుర్తిస్తున్నారు. అందుకు అనుగునంగానే భారత ప్రభుత్వం సైతం ఇన్సూరెన్స్ రంగానికి ఉతమిస్తోంది. ఎల్ ఐసీ లాంటి సంస్థలతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వార కూడా ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఇందులో ప్రధానంగా ఎస్ బీఐ గురించి చెప్పుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఇందులో ముఖ్యమంగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సేవలు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి మొదలు పలు రకాల ఖాతాలు ఉన్నాయి. ఎస్‌బీఐలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ ధన్ ఖాతాను తెరవొచ్చు. ఈ అకౌంట్ కలిగిన వారికి ఉచితంగానే 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. అయితే దీనికి బ్యాంక్ ఖాతాదారులు రూపే డెబిట్ కార్డును ఉపయోగిస్తూ ఉండాలి. మనం ఎస్ బీఐ బ్యాంకు అకౌంట్ తెరిచే సమయంలోనే ఈ డెబిట్ కార్డు అందిస్తారు.
ప్రమాదానికి ముందు జన్ ధన్ అకౌంట్ కలిగిన వారు 90 రోజుల్లో కచ్చితంగా ఒక్కసారైనా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌ను నిర్వహించి ఉండాలి. అప్పుడు ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారు మరణిస్తే, ఈ ప్రమాద బీమా సొమ్మును నామినీకి చెల్లిస్తారు. ప్రమాద భీమా క్లెయిమ్ డబ్బులు రావాలంటే చనిపోయిన వారి ఆధార్ కార్డు, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికెట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వంటివి అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్యాంకు ఖాతా కలిగిన బ్రాంచ్ లో సమర్పిస్తే, పది రోజుల్లోగా క్లెయిమ్ డబ్బులు లభిస్తాయి.