బిజినెస్ డెస్క్- దేశంలో అతి పెద్ద జాతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలకమైన సూచన చేసింది. లేదంటే బ్యాంకు అకౌంట్ నిర్వహణ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సెప్టెంబర్ నెల చివరి కల్లా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను కోరింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
అప్పుడే ఎటువంటి అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని స్పష్టం చేసింది. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలనంటే ఇబ్బందులు తప్పవు. బ్యాంక్ లో నగదు రూపంలో ఒక రోజులో 50 వేల రూపాయలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే పాన్ కార్డు తప్పనిసరి.
అందుకే ఎవరైతే ఇంకా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోలేదో వారందరు వెంటనే ఆ పని పూర్తి చేయాలి. సెప్టెంబర్ నెల చివరి వరకు ఇందుకు అవకాశం ఇస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అందుకే వెంటనే సమీప బ్యాంకులకు, లేదా ఈసేవ సెంటర్లకు వెళ్లి మీ మీ పాన్ కార్డు నెంబర్లను, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకొండి మరి.
We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/QiMk66fLM2
— State Bank of India (@TheOfficialSBI) August 6, 2021