బిగ్ బాస్ సీజన్5- అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ షో ప్రారంభం అయి వారం రోజులు అవుతోంది. ఐతే మొదటి వారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తాజా అప్ డెస్ట్ చూస్తే తెలుస్తోంది. గత నాలుగు సీజన్స్ లో లేనివిధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ని తొలి రోజే హౌస్ లోకి పంపారు. కానీ బిగ్ బాస్ సీజన్ 5 షోలో పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో జోష్ తగ్గినట్లు ఈ షో రేటింగ్స్ చూస్తే అర్ధమవుతోంది.
అందుకే ప్రేక్షకుల నిరాశని పోగొట్టి, వారిలో కాస్త జోష్ నింపేందుకు బిగ్ బాస్ టీం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షోలో మసాలా డోస్ పెంచడం, ఊహించని ట్విస్ట్ లు ఇవ్వడం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని బిగ్ బాస్ టీం భావిస్తోందట. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫష్ట్ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. ఈ రోజు ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ప్రకటించబోతున్నారు.
దీంతో ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5 నుంచి మొదటి వారం ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరుపై శనివారం నుంచే పెద్ద ఎత్తున లీకులు వినపడుతున్నాయి. ఈవారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ బోల్డ్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సరయు అని ప్రచారం జరుగుతోంది. ఇది బిగ్ బాస్ హౌజ్ లోని వారే కాదు, ప్రేక్షకులు కూడా ఊహించని వార్త అని చెప్పవచ్చు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో తొలి వారం నామినేషన్స్‌లో యాంకర్ రవి, మానస్, ఆర్జే కాజల్, హమీదా, మోడల్ జశ్వంత్, సరయు ఉన్న విషయం తెలిసిందే. వారిలో శనివారం నాగార్జున యాంకర్ రవి, హమీదాను సేవ్ చేశాడు. మిగిలిన నలుగురిలో మోడల్ జశ్వంత్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్ సరయుపై ప్రేక్షకులకు బారీ అంచనాలే ఉన్నాయి. యూట్యూబ్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో సరయు చేసే రచ్చ అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇలాంటి హంగామాతో హీట్ పుట్టిస్తుందని, ఆమె ముందు మిగిలిన కంటెస్టెంట్స్ నిలవడం కష్టమే అని అంతా భావించారు.
కానీ సిన్ రివర్స్ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో ఆర్జే కాజల్ తో కాసేపు వాగ్వాదం నడిచింది తప్పా మరే ఇతర కంప్లైంట్స్ సరయు మీదు లేవు, కానీ అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అవుతుండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.