ప్రస్తుతం ఉన్న హీరోయిన్‌లలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనదైన ముద్ర వేస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఈ హైబ్రీడ్ పిల్ల. సినిమాల పరంగా కాకుండా.. తనదైన వ్యక్తిత్వంతో అభిమానులను పెంచుకుంటుంది. ఇక సాయి పల్లవికి సంబంధించిన ప్రతి వార్త వైరల్‌గా మారుతుంది. డాక్టర్ చదివిన సాయి పల్లవి తర్వాత యాక్టర్‌గా మారింది. అంతటి క్రేజ్ ఉన్న సాయి పల్లవి రీసెంట్‌గా విరాట పర్వం సినిమాతో మన ముందుకు వచ్చింది. నక్సలైట్ పల్లవి పాత్రలో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్‌కు అతీతంగా సినిమాలు చేసే హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. జూలై 15న మళ్లీ ‘గార్గి’అనే చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లతో బిజీగా ఉంది సాయి పల్లవి. ఈ క్రమంలో ఆమె రియల్ లైఫ్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించింది.
ప్రస్తుతం సాయి పల్లవి ఎందరో యువకుల కలల రాణిగా వెలుగుతోంది. ఆమెను ప్రేమించే వారు ఎందరో. మరి సాయి పల్లవి ఎవరినైనా ప్రేమించిందా.. అంటే ఆసక్తికర సమాధానం చెప్పింది. లవ్ లెటర్ రాయడం.. అమ్మనాన్నల దగ్గర బుక్ అవ్వడం.. వారి చేతుల్లో చావు దెబ్బలు తినడం జరిగాయట. గార్గి సినిమా ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర బృందం మై విలేజ్ షో టాక్ షోలో పాల్గొన్నది. నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన ఈ టాక్ షోకు గంగవ్వ హోస్ట్‌గా ఉంది. అందులో రానా దగ్గుబాటి కూడా పాల్గొన్నారు.
షోలో భాగంగా గంగవ్వ.. ‘‘విరాట పర్వంలో రవన్న పాత్రకు నువ్వు లవ్ లెటర్ రాశావు కదా, రియల్ లైఫ్‌లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా అని గంగవ్వ.. సాయి పల్లవిని అడిగింది. దానికి ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. దాన్ని నా పేరెంట్స్ చూశారు. నన్ను చాలా బాగా కొట్టారు’’ అని చెప్పుకొచ్చింది‘గార్గి’ సినిమాలో తండ్రి కోసం ఆరాటపడే టీచర్ అయిన కూతురు పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. సాయి పల్లవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.