ముంబయి- సచిన్ టెండుల్కర్ ఎంతో మంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం. సచిన్ ప్రస్తుతం క్రికెట్ ఆడకపోయినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయారు. సచిన్ సమాజంలో జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వార స్పందిస్తూనే ఉంటారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.
ఇదిగో సచిన్ టెండూల్కర్ మరోసారు తన సహృదయతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్ పోలీసును వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు సచిన్. ఇటీవల సచిన్ ఫ్రెండ్ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ఆమెను ఆటోలో జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చారు. అలా సకాలంలో ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనను ట్విటర్‌లో వెల్లడించిన సచిన్.. అలాంటివారివల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు.. వారికి అభినందనలు.. మనమంతా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. అని పోస్ట్ చేశాడు. సచిన్ టెండుల్కర్ తమను స్వయంగా కలిసి ధ్యాంక్స్ చెప్పడంతో ఆ ట్రాఫిక్ పోలీసులు చాలా సంతోషపడిపోయారు. అది ఆయన గొప్పతనానికి నిదర్శమని వారన్నారు.
A heartfelt thanks to all those who go beyond the call of duty. pic.twitter.com/GXAofvLOHx
— Sachin Tendulkar (@sachin_rt) December 17, 2021