హైదరాబాద్- సమర్ధవంతమైన అధికారి ఎక్కడ ఉన్నా తన ప్రతిభను చాటిచెబుతారు. ఆ ఆధికారి ఏ శాఖలో ఉన్నా అక్కడ సమూల మార్పును తీసుకువస్తారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కమీషనర్ గా సమర్ధవంతంగా పనిచేసి, తనదైన మార్కును చూపిన సజ్జనార్, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సజ్జనార్. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుని ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు సజ్జనార్. అలా మెల్ల మెల్లగా ఆర్టీసీని మెరుగుపరిచేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు ఎండీ సజ్జనార్. నష్టాల ఊబిలో చిక్కుకున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.
ఒకే గమ్యానికి చేరాల్సిన ప్రయాణికులు ఉంటే ఆర్టీసీ బస్సును ఇంటికే పంపిస్తామంటూ సరికొత్త సర్వీసు మొదలు పెట్టారు సజ్జనార్. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పసిబిడ్డలకు పాలిచ్చే తల్లుల కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో పసిబిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు వీలుగా బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ లను ఏర్పాటు చేయాలని సజ్జనార్ నిర్ణయించారు.
అందులో భాగంగా ముందు హైదరాబాద్ మహాత్మా గాంధఈ బస్ స్టేషన్ లో బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాలను ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్లలో తల్లులు తమ పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ లను ఏర్పాటు చేయబోతున్నారు.
From today Milk feeding kiosk was arranged at #MGBS, Soon this kind of facility will be opened in all bus stations@DrTamilisaiGuv @TelanganaCMO @KTRTRS @RaoKavitha @TelanganaCS @SmitaSabharwal @puvvada_ajay @Govardhan_MLA @SCWTelangana @pandiribhargavi @KatariRevathi @smitapop pic.twitter.com/VFvcgQIFiS
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 28, 2021