RRR Movie : అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రానే వచ్చింది. రావటం కూడా మామూలుగా రాలేదు.. ఓ ప్రభంజనంలా వచ్చింది. సినిమా సూపర్ హిట్ అనే టాక్ ప్రచారం జరుగుతోంది. సినిమా హాలు దగ్గర ఆల్రెడీ సంబరాలు మొదలయ్యాయి. బాంబులు పేలుస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సినిమా తారాగణం, ఇతర ప్రముఖులు ఒక్కొక్కరిగా తమకనువైన చోట సినిమా చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఎంఎంబీ మాల్‌లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు. రామ్ చరణ్ భ్రమరాంబ టాకిస్‌లో సినిమా చూశారు.
ఇక రామ్ చరణ్ భార్య కూడా సినిమా హాల్‌కు వెళ్లి సినిమా చూశారు. నాటునాటు సాంగ్‌లో రామ్‌చరణ్ ఎంట్రీతో కేకలు పెడుతున్న ఫ్యాన్స్‌తో పాటు ఆమె కూడా అల్లరి చేశారు. పేపర్లు తీసి స్ర్కీన్‌వైపు చల్లారు. ఫ్యాన్స్‌తో పాటు థియేటర్‌లో రచ్చరచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, ఓలివియా ప్రధాన పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఉపాసన అల్లరిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RRR ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందా..?