ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా హీరో రామ్ చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన సినిమా. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాపై టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తోంది రాజమౌళి టీమ్. ఈ క్రమంలో బాలీవుడ్ లో ప్రముఖ బుల్లితెర షో ది కపిల్ శర్మ షోలో పాల్గొంది ఆర్ఆర్ఆర్ టీమ్. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియాభట్ అతిథులుగా హాజరయ్యారు. ఇదిగో ఈ సందర్బంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు కొత్త అర్థం చెప్పారు బాలీవుడ్ వ్యాఖ్యాత కపిల్‌శర్మ. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ను కపిల్ శర్మ నాన్ స్టాప్ గా నవ్వించారు.
ఆర్‌ఆర్‌ఆర్ అంటే, రూపాయి రూపాయి రూపాయి.. అని రాజమౌళిని చమత్కరించారు కపిల్ శర్మ. ఇక ఈ షోలో రాజమౌళి, రమ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ లకు పలు ప్రశ్నలు సంధించారాయన. మీకు ఎయిర్ లైన్స్, హాస్పిటల్స్, హోటల్స్‌తో పాటు ఇతర వ్యాపారాలుండగా ఎందుకు సినిమాల్లో నటిస్తున్నారు.. అని రామ్ చరణ్ ను అడిగారు కపిల్. ఎయిర్ లైన్స్ కంపెనీ ఉన్నా ఈ షోకి వచ్చే అవకాశం ఉండదు కదా.. అని తనదైన స్తైల్లో ఆన్సర్ ఇచ్చారు రామ్ చరణ్.
అెతే కాది కపిల్ శర్మ, ఆలియాభట్‌పై కూడా సెటైర్లు వేశారు. ఆలియా నువ్వు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేయడానికి ముందు కథ విన్నావా లేక, ఆర్.. (రణ్‌బీర్ కపూర్) అక్షరం ఉందని ఒప్పుకున్నావా అని ప్రశ్నించడంతో, ఆమె సిగ్గు పడింది.
ఇక, రామ్‌చరణ్ సర్ మీ నాన్న చిరంజీవి గారు, బాబాయ్ పవన్ కల్యాణ్ స్టార్ హీరోలు.. ఇంకా మీ ఇంట్లో పెద్ద హీరోలు ఉన్నారు.. మీరంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు వాచ్‌మెన్ వచ్చి.. ఫ్యాన్ వచ్చారు అని చెబితే, ఎవరి ఫ్యాన్ అని కన్‌ఫ్యూజ్ అవుతారా అని ప్రశ్నించారు కపిల్ శర్మ. దీనికి స్పందించిన రామ్ చరణ్.. తప్పకుండా అవుతానని అన్నారు. ఫ్యాన్ విషయంలోనే కాదు.. ఓ డైరెక్టర్ వచ్చినా.. ఎవరి కోసం కథ తెచ్చారో అనే కన్ ఫ్యూజన్ ఉంటుందని చెప్పారు.