ఫిల్మ్ డెస్క్- RRR.. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా హీరో రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది 2022 జనవరి 7న విడుదల కాబోతోంది. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరన్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ రన్ టైమ్ ఎంత ఉంటుందనే విషయంపై ముందు నుంచి చర్చ జరుగుతోంది. తాజాగా RRR రన్ టైమ్ పై సోషల్ మీడియాలో ఓ లీక్ హల్ చల్ చేస్తోంది. మొత్తం ఎడిటింగ్ పూర్తయిన తర్వాత సినిమా రన్ టైమ్ ను రాజమౌళి 3 గంటల 6 నిమిషాలుగా కుదించారని సమాచారం. మూడు గంటల లోపే రన్ టైమ్ ను ఫిక్స్ చేయాలనుకుని రాజమౌళి భావించినా, అనుకున్న ఫీల్ తో సినిమాను తీసుకు రావడానికి 186 నిమిషాల వ్యవథి ఉన్న సినిమానే సెన్సార్‌ను పూర్తి చేయించారని తెలుస్తోంది.
RRR సినిమాకు ఆత్మవంటి జనని సాంగ్ ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుదల చేసింది. ఈ సాంగే సినిమాకు కీలకం కానుందని రాజమౌళి భావిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లాలాని రాజమౌళి నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ విమానాన్ని బుక్ చేసుకున్నారు. అన్నట్లు డిసెంబర్ మొదటి వారంలో RRR ట్రైలర్ విడుదల కానుంది.