శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అతివేగమంటూ హీరో సాయి ధరమ్ తేజ్ కేసు నమోదు చేసిన పోలీసులు అదే సమయంలో రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్డును శుభ్రంగా ఉంచాల్సిన మున్సిపాలిటీపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కేసు పెట్టడం వల్ల నగరంలోని మిగతా ఏరియాల్లో అజాగ్రత్తగా ఉండేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారంటూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరీ దీనిపై పోలీసులు గాని, మున్సిపల్ అధికారులు గాని స్పందిస్తారో లేదు చూడాలి.