హన్మకొండ జిల్లా హసన్ పర్తి జెడ్పీ హైస్కూల్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయ్యాయి. పదో తరగతి విద్యార్థులున్న గదిలోని పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడ్డాయి. ఈ ఘటనతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడటంతో ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది.
ఘటన గురించి తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు పరుగులు తీశారు. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెచ్చులు ఊడే వరకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో చెన్నైలో ఇలాంటి సంఘటనే జరిగింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బాత్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. లేదంటా ఇలాంటి ప్రమాదాలు జరుగుతంటాయని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.