బుల్లితెర డెస్క్- ఒకప్పుడు తాను తల్లి కావడం కష్టమని డాక్టర్లు చెప్పారని ఎమ్మెల్యే, జబర్దస్ట్ జడ్జ్ రోజా గుర్తు చేసుకున్నారు. గర్భం దాల్చినా అది నిలబడదని చెప్పడంతో ఎంత బాధను అనుభవించాలో చెప్పలేనని అన్నారు. కానీ సరిగ్గా సంవత్సరం తరువాత తాను గర్బం దాల్చగా, తనకు కూతురు పుట్టిందని చెప్పారు రోజా. అందుకే తన కూతురు అన్షు మాలిక అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని ఎమోషనల్ అయ్యారు రోజా.
వినాయక చవితి పండగ సందర్బంగా ఈటీవీలో ప్రత్యేక కార్యక్రమం ఊరిలో వినాయకుడు ప్రసారం కాబోతోంది. ఇందుకు సంబందించిన ప్రోమోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుండగా, తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులంతా వారి వారి కుటుంబాలతో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కు సుడిగాలి సుధీర్, రష్మీ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఊరిలో వినాయకుడు కార్యక్రమానికి సంబందించిన తాజా ప్రోమోలో సుడిగాలి సుధీర్, రష్మీ, వర్ష వాళ్ళ ఇంటికి, ఆటో రామ్ ప్రసాద్, రోహిణి వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు. ఈ ఈవెంట్ కి నటులు శ్రీకాంత్, రాజ్ తరుణ్ అలాగే ఇంకా కొంత మంది నటీ నటులు అతిథులుగా వచ్చారు. అంతే కాదు జబర్దస్త్ ఆర్టిస్ట్ లతో పాటు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రోగ్రాంలో స్కిట్ చేయబోతున్నారు.
ఇందులో భాగంగానే రోజా పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి కి గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్బంగానే రోజా తన గర్భం, పిల్లల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. అన్నట్లు మాా ఊరిలో వినాయకుడు ప్రత్యేక కార్యక్రమంలో కొన్ని రోజులు జబర్దస్త్ జడ్జ్ గా చేసిన అలనాటి హీరోయిన్ ఇంద్రజ కూడా పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వినాయక చవితి వరకు ఆగాల్సిందే.