ఫిల్మ్ డెస్క్- ఆలీతో సరదాగా.. ఈ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగానికి చెందిన ప్రముఖులందరిని కమేడియన్ ఆలి ఇంటర్వూ చేస్తారు. ఈ షోకు మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అభిమానులు తమ తమ అభిమాన సినీ ప్రమఖుల అంతరంగాలను ఆలితో సరదాగా కార్యక్రమం ద్వార తెలుసుకోగలుగుతున్నారు.
ఇక ఈసారి ఆలితో సరదాగా కార్యక్రమానికి యంగ్ హీరో తరుణ్ తల్లి, సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తన భర్త చక్రపాణితో కలిసి వచ్చారు. ఈ షోలో తమ సినీ జీవితం, వ్యక్తిగత విషయాలకు సంబందించి చాలా విషయాలను పంచుకున్నారు. కమేడియన్ ఆలితో తమ జ్ఞాపకాలను, తీపి గుర్తులను చెప్పుకున్నారు.
ఆలితో సరగాదా షోలోకి ఎంటరవ్వగానే రోజా రమణి దంపతులకు అక్కా బావ అంటూ స్వాగతం పలికారు ఆలి. వాళ్ళిద్దరిపై సరదాగా పంచులేస్తూ చాలా విషయాలు రాబట్టారు. ఈ క్రమంలో స్విజ్జర్లాండ్ లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు రోజా రమణి. తాము స్విజ్జర్లాండ్‌లో ఉన్నప్పుడు ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో ఇంట్లో తండ్రీ కొడుకులు తరుణ్, చక్రపాణి టవల్ కట్టుకొని పూజలు చేస్తున్నారని రోజా రమణి చెప్పారు.
భక్తి భావంలో మునిగిపోయి ఇండియా నుంచి తెచ్చిన అగరవత్తులు, కర్పూరం కడ్డీలు బాగా వెలిగించడంతో స్మోక్ డిటెక్టర్ అలారం మోగటంతో పోలీసులు వచ్చారని చెప్పింది. ఇక చిన్నతనంలో తనకు పౌడర్ తినే అలవాటు ఉండేదని గుర్తు చేసుకున్నారు. తమ ఫ్యామిలీకి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో మంచి అనుబంధం ఉందని చెప్పారు రోజా రమణి. ఈ షోకు సంబందించిన ఫ్రోమోను విడుదల చేయగా, పూర్తి కార్యక్రమం జులై 19వ తేదీన ప్రసారం కాబోతోంది.