భార్య లేకుండా భర్త ఒక వారం బతకగలడు కానీ.. జీవితాంతం భార్య తోడు ఉండాల్సిందే. భర్త విజయంలోనూ, వైఫల్యంలోనూ తోడు నీడగా ఉంటుంది భార్య. భర్తే సర్వస్వంగా బతుకుతుంది భార్య. చివరకు భర్త చేతిలో.. పుణ్య స్త్రీగా చనిపోవాలని ఆశిస్తుందీ భార్య. కానీ శివమోహిని విషయంలో మాత్రం..
మానవ సంబంధాల్లో ఎక్కువ కాలం నడిచే బంధం.. భార్యా భర్తలదే. పెళ్లైన నాటి నుండి అతడిలో సగమై నడుస్తుంది భార్య. చిన్న చిన్న గొడవలు, అలకలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. భార్య లేకుండా భర్త ఒక వారం బతకగలడు కానీ.. జీవితాంతం భార్య తోడు ఉండాల్సిందే. భర్త విజయంలోనూ, వైఫల్యంలోనూ తోడు నీడగా ఉంటుంది భార్య. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదీ ఉందీ అంటే.. అమ్మైనా కావాల్సిందే లేదా భార్య అయినా అవ్వాల్సిందే. భర్తే సర్వస్వం అని భావిస్తుంది భార్య. చివరకు భర్త చేతిలో.. పుణ్య స్త్రీగా చనిపోవాలని ఆశిస్తుందీ . కానీ శివమోహినిని విధి వెక్కిరించింది. ఆమెకు భర్త లేకుండా చేసింది. చివరకు కడసారి చూపుకు కూడా నోచుకోకుండా చేసింది.
తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది భార్య. తిరిగి ఇంటికి వచ్చే సరికి భర్త లేడు. ఏమైందని ఆరా తీస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసింది. చివరకు భర్త ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయానని ఆవేదన చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా తల సముద్రం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవాది వద్ద ఈ నెల 15వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తలసముద్రం గ్రామానికి చెందిన బొంతల సురేష్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగాక మృతుడి వివరాలు పోలీసులకు తెలియకపోవడంతో మూడు రోజులు వేచి చూశారు.
సురేష్ వద్ద ఫోన్ లేకపోవడంతో పాటు అతడి వద్ద ఎటువంటి వివరాలు దొరక్కపోవడంతో మూడు రోజుల పాటు వేచి చూసిన పోలీసులు ఖననం చేశారు. అయితే పుట్టింటికి వెళ్లిన భార్యకు ఈ విషయం తెలియదు. మూడు రోజుల తర్వాత ఆమె సొంతింటికి వచ్చేసింది. అయితే భర్త కనిపించకపోవడంతో ఆరా తీసింది. ఎక్కడికి వెళ్లాడా అని వెతుకుతుండగా.. ఈ ప్రమాదం గురించి ఆమెకు తెలిసి ..ఆ ఫొటోలు పరిశీలిస్తే అక్కడ చనిపోయినది ఆమె భర్త సురేష్ అనే విషయం అర్థమైంది. దీంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఎస్‌ఐ వై. సింహాచలం మాట్లాడుతూ ఆధారాలు సేకరించి మృతి చెందిన వ్యక్తిని నిర్ధారిస్తామని అన్నారు. అయితే మృతదేహాన్ని ఖననం చేయడంతో ఆమెకు చివరి చూపు కూడా దక్కలేదు.