ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ చిన్న కూతురు రియా కపూర్ శనివారం ఓ ఇంటిది అయిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ బులానీని రియా వివాహం చేసుకుంది. ముంబైలోని అనిల్ కపూర్ నివాసంలో బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మద్య వీరి పెళ్లి జరిగింది. వివాహ వేడుక తరువాత సోమవారం జరిగిన పెళ్లి విందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రియా కపూర్, కరణ్ బులానీ పెళ్లి విందులో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, బోణీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, ఫరా ఖాన్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా విందును ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. రియా కపూర్, తన భర్త కరణ్ బులానీతో కలిసి ఉన్న తమ పెళ్లి ఫొటోను షేర్ చేసింది.
ప్రాణ స్నేహితుడిని పెళ్లాడిన సందర్బాన్ని పురస్కరించుకును తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. పన్నెండేళ్ల తర్వాత ఈ రోజు నేను ఎంతగా ఏడ్చానో.. ఎంతలా భయంతో వణికిపోయానో నాకు మాత్రమే తెలుసు.. ఇలాంటి ఒక అద్భుతమైన క్షణాన్ని, ఆనందాన్ని నేను ఇంతవరకు అనుభవించలేదు..
ప్రతి రోజు రాత్రి 11 గంటల కంటే ముందే, అది కూడా నా తల్లిదండ్రులు నిద్రపోకముందే ఇంటికి చేరుకునే అమ్మాయిని.. ఇప్పుడు మనదైన కొత్త కుటుంబంలో అడుగుపెడుతూ కూడా అమ్మానాన్నలు, నా తోబట్టువులతో కలిసి జీవించడం గొప్ప అనుభూతి.. అని రియా చెప్పుకొచ్చింది. పలువురు సెలబ్రిటీలు రియా, కరణ్ పెళ్లి నేపధ్యంలో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.
And with that, I feel like my Magnum Opus is complete…with our 2 super-daughters and 3 super-sons, we have the biggest blockbuster ever!
Our hearts are full and our family is blessed 🙏🏻#KaranBoolani @RheaKapoor #SunitaKapoor @anandahuja @sonamakapoor @HarshKapoor_ pic.twitter.com/YixkFTPPU9— Anil Kapoor (@AnilKapoor) August 16, 2021