సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విపత్కర సమయంలో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుంటూ సినిమాగా రూపొందిస్తున్నాడు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి వరుసగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ”క్లైమాక్స్” ”నగ్నం” ”పవర్ స్టార్” అనే సినిమాలను విడుదల చేసిన ”మర్డర్” ”థ్రిల్లర్” మూవీస్ ని రిలీజ్ కి రెడీ చేశారు. వీటితో పాటు ఫిక్షనల్ రియాలిటీ అనే కొత్త జోనర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ”ఆర్జీవీ మిస్సింగ్” ”అల్లు” అనే సినిమాలు అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో నా కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం అంటూ ”డేంజరస్” అనే మూవీ అనౌన్స్ చేసారు.
ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో వేరే వ్యాపార వేత్తతో కలసి ఓటీటీ ప్లాట్ ఫామ్ స్పార్క్ ను ఆరంభించాడు. మే 15 (నేటి నుంచీ) నుంచి ఇది అందుబాటులోకి రానుంది. స్పార్క్ ప్రొడక్షన్ పేరిట డేంజరస్ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం యొక్క ట్రైలర్ ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. వర్మ ఈ ఓటీటీతోనైనా స్థిరంగా స్థిర పడతాడా? లేక కొత్తదనం అంటూ వేరే దాని వెంట పడతాడా అన్నది తేలాల్సి ఉంది. ఇది ఇద్దరు హోమో సెక్స్‌వల్స్ కథ అదేనండీ లెస్బియన్స్ కథ అని కవ్విస్తున్నాడు. లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని తన స్టోరీ థీమ్ చెప్పకనే చెప్పాడు. ఆపై వరుస ట్వీట్లతో తన హీరోయిన్లు, స్టోరీని ఎలివేట్ చేశాడు.