సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించి రిపబ్లిక్ సినిమాపై కొల్లేరులోని కొంతమంది జాయింట్ కలెక్టర్, ఎప్పీకి ఫిర్యాదు చేశారు. విషపూరిత రసాయనాలతో చేపలు సాగు చేస్తున్నట్లు సినిమాలో చూపించినట్లు వాళ్లు ఆరోపించారు. దీని వల్ల చేపల సాగుపై ఆధారపడి బతుకుతున్న తాము ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. తమ ప్రాంతం గురించి చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని, అప్పటి వరకూ సినిమాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.
కాగా దీనిపై చిత్రబృందం స్పందించలేదు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో సన్నివేశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలను చూపి, మనోభావాలు దెబ్బతింటున్నాయని నిరసనలకు దిగుతున్నారు. మరీ రిపబ్లిక్ సినిమాపై వచ్చిన ఈ ఆరోపణలు సినిమా ప్రదర్శనను ఎంతలా ప్రభావితం చేస్తాయో చూడాలి. మరీ ఈ సినిమా వల్ల నిజంగానే చేపల సాగు దారులకు నష్టం వాటిల్లనుందా? అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ రివ్యూ