ఫిల్మ్ డెస్క్- అకీరా నందన్.. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ పేరు తెలియని వారుండరేమో. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులైతే అకీరా నందన్ అంటే పడి చచ్చిపోతారు. ఎప్పుడెప్పుడు అకీరా సినిమాల్లోకి వస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు అనుగునంగానే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ మధ్యనే అకీరా నందన్ కర్ర సాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది అది చూసి ఎవరికి వారు అకీరా సినిమా ఎంట్రీపై ఉహించేసుకుంటున్నారు. త్వరలోనే అకీరా సినీమాల్లో నటించబోతున్నారని, అందుకే కర్రసాములో ట్రైనింగ్ తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు.
ఇదిగో ఇప్పుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ మీద వచ్చిన రూమర్లను రేణూ దేశాయ్ ఖండించారు. చాలా రోజులుగా అభిమానులతో టచ్ లో లేకుండా పోయిన రేణూ దేశాయ్, తాజాగా లైవ్‌లోకి వచ్చి తన ఫాలోవర్లతో పలు అంశాలను పంచుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇంట్లోనే ఉంటున్నానని చెప్పిన రేణూ, మే నుంచి ప్రపంచానికి దూరంగా ఉంటున్నానని తెలిపారు.
ఈ సందర్భంలో అకీరా నందన్ కర్రసాము, సినీ ఎంట్రీపై నెటిజన్స్ ఆమెను అడిగేశారు. అభిమానుల ప్రశ్నలపై స్పందించిన రేణూ దేశాయ్ అకీరా ఇప్పుడు సినిమాల్లోకి రాడని తేల్చేశారు. అలాంటి ఉద్దేశ్యం గానీ, ఆసక్తి గానీ అకీరాకు లేదని, అతను ఇంకా చిన్నపిల్లవాడేనని చెప్పారు. అంతే కాదు అకీరాకు 17 ఏళ్లే ఉన్నాయని, ఇంకా చదువుకోవాల్సి ఉందని అన్నారు. పెద్దయ్యాక ఏం అవుతాడో ఇప్పుడే ఎవ్వరం చెప్పలేమన్న రేణూ దేశాయ్, అతనికి ఇప్పుడు సినిమాల మీద అంత ఆసక్తి అయితే లేదని స్పష్టం చేశారు.